పొలంబడి నిర్వహిస్తున్న ఎఒ శేషాద్రి
ప్రజాశక్తి - కౌతాళం
వ్యవసాయ రంగంలో మంచి దిగుబడులు సాధించాలంటే పొలంబడి కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఎఒ శేషాద్రి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడారు. రైతులు అధిక దిగుబడులు సాధించాలని కోరారు. కౌతాళం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో పొలంబడికి సంబంధించి కొల్లాబరేటర్ ఫార్మర్ పత్తి విత్తనాలు, పొలంబడి క్షేత్ర నమూనా ప్రకారం విత్తారని తెలిపారు. ఈ క్షేత్రంలో రెండెకరాల్లో రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ క్షేత్రంలో 30 మంది పొలంబడి రైతులకు శిక్షణ కార్యక్రమం కూడా ప్రతి మంగళవారం ఉంటుందని తెలిపారు.










