May 31,2023 22:39

పుట్టపర్తిలో ప్రతిజ్ఞ చేస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది

పుట్టపర్తి రూరల్‌: ధూమపానం వలన ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయని జిల్లా వైద్యాధికారి ఎస్‌వి కృష్ణారెడ్డి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం సత్యసాయి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి, పుట్టపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ధూమపానం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ కృష్ణయ్య, ఎన్‌సిడిసిడి అధికారి డాక్టర్‌ నివేదిత, డిపిఎంఒ, డిఎంఒ కుల్లాయప్ప నాయక్‌, ఐసిడిఎస్‌ పీడీ లక్ష్మి కుమారి తదితరులతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గుడిబండ : పొగాకు వాడటం ప్రమాదకరమని గుడిబండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్లు సౌందర్య, వెంగల్‌రావు అన్నారు. గుడిబండలో పిహెచ్‌సి అధికారులు. వైద్య సిబ్బంది ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
పరిగి : పొగాకు వినియోగం వల్ల ప్రస్తుత సమాజంలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను గడపగడపకు తీసుకెళ్లి ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని జిల్లా కార్యక్రమాల పర్యవేక్షణఅధికారి, డాక్టర్‌ కెసికె.నాయక్‌ వెల్లడించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని పరిగి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు డాక్టర్‌.నవీన, డాక్టర్‌.స్వరూపరెడ్డి, డాక్టర్‌ సురేష్‌, డాక్టర్‌.రూబి పర్యవేక్షకులు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి మానవహారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పరిగి ఇండియన్‌ గార్మెంట్స్‌ యాజమాన్య సభ్యులు, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
లేపాక్షి : పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వైద్యాధికారి డాక్టర్‌ వెంకటచిరంజీవి ఆధ్వర్యంలో బుధవారం లేపాక్షిలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ హుస్సేన్‌ బీ, ఎంపిహెచ్‌ఒ సుదర్శన్‌ బాబు, సుబ్రమణ్యం, భాగ్యలక్ష్మి, హెల్త్‌ సూపర్‌వైజరు గోవిందప్ప, హెల్త్‌ , ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : పొగాకు, గుట్కాలను మానితే క్యాన్సర్‌ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి గంగిరెడ్డి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బత్తలపల్లిలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు చంద్రశేఖర్‌రెడ్డి, నారమ్మ, గౌరమ్మ, ఆశా వర్కర్లు, నర్సింగ్‌, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
సోమందేపల్లి : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ నరేష్‌ కుమార్‌, డాక్టర్‌ హరీష్‌ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ఈసందర్బంగా గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ఒ మనోహర్‌ రెడ్డి, సిబ్బంది వెంకటసుబ్బమ్మ, రవీంద్ర, రత్నమ్మ, అనిల్‌, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.