సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ కల్పనకుమారి
ప్రజాశక్తి-సీతంపేట : ఇంజినీరింగ్ పనులను వేగవంతం చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. బుధవారం పిఆర్, ఆర్‌డబ్ల్యుఎస్, ఎపిఇపిడిసిఎల్, హౌసింగ్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం పనులను పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో క్లోరినేషన్ క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. గిరిజన గ్రామాలకు తాగునీరు సౌకర్యం కల్పించాలని అన్నారు. హౌసింగ్ లేఅవుట్లకు నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. టూరిజం ప్రాజెక్టులు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్ ఇఇ రాధారాణి, టిడబ్ల్యు ఇఇ సింహాచలం, పిఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ డిఇలు కృష్ణకుమార్, ఢిల్లీశ్వరరావు, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.










