Oct 18,2023 00:43

పనులు పరిశీలిస్తున్న పిఒ అభిషేక్‌

జాశక్తి-జి.మాడుగుల:కొత్తపల్లి జలపాతం ఆధునీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్ట్‌ అధికారి వి, అభిషేక్‌ ఆదేశించారు. మంగళవారం కొత్తపల్లి జలపాతాన్ని సందర్శించి జలపాతం ఆధునీకరణ పనులను పరిశీలించారు. పర్యాటక సీజన్‌ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పనులు వేగంగా పూర్తి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో పటిష్టమైన నాణ్యతలో పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ డివి ఆర్‌ ఎం. రాజు, ఏఈ దేముళ్ళు తదితరులు పాల్గొన్నారు.