May 02,2023 10:01

కాలువ పనులను పరిశీలన చేస్తున్న ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ

           హిందూపురం : పురపాలక సంఘంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో గుత్తేదారులు తప్పనిసరిగా నాణ్యత పాటించాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ పేర్కోన్నారు. సోమవారం పట్టణ పరిదిలోని ముదిరెడ్డిపల్లి ఐటిఐ కళాశాల వద్ద రూ.39 లక్షలతో చేపట్టిన డిస్పోజల్‌ డ్రైనేజ్‌ పనులను ఇంజినీర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా గుత్తేదారులకు, ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ నాగమణి, డిఈఈ నీరజ, ఎఈ నాగేంద్ర, కాంట్రాక్టర్‌ రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
వేసవి బడి ప్రారంభం
పట్టణంలోని త్యాగరాజనగర్‌లో ఉన్న మార్గదర్శి విద్యానికేతన్‌ నిర్వాహుకులు కె. సాయికళ, కె.మాళప్ప దంపతుల ఆధ్వర్యంలో హెల్పింగ్‌ హాండ్స్‌ గ్రూప్‌ సభ్యులు సాఫ్ట్‌ వెర్‌ ఇంజనీర్‌ శ్రీదర్‌ గౌడ్‌, భగీరధీస్‌ నవీన్‌, బి.అంజప్ప సౌజన్యంతో నిర్వహిస్తున్న 25వ రజతోత్సవ ఉచిత వేసవిబడిని ఛైర్‌పర్సన్‌ ఇంద్రజ సోమవారం ప్రారంభించారు. వేసవి సెలవులలో నెల రోజుల పాటు కరాటే, కంప్యూటర్‌, యోగ, నత్యాలు, చిత్రలేఖనం, సంగీతం తదితర విధ్యలలో తర్పీదు ఇవ్వడం అభినందనీయం అన్నారు. అనంతరం దాత ముద్దిరెడ్డిపల్లి పట్టుచీరల వ్యాపారి ఎ సి నాగరాజు అందించిన పలకలు, బలపాలు పంపిణీ చేశారు. దాతలు శ్రీవారి జ్యువెల్లరీస్‌ ఎంఎస్‌. ప్రకాష్‌, బాలికల కాలేజీ లెక్చరర్‌ బి.విజయలక్ష్మిలు విద్యార్థులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహకులతో పాటు దాతలు శ్రీధర్‌ గౌడ్‌, నవీన్‌, దయానంద్‌, శివ కుమార్‌, అర్‌ వి రాజు, డాన్స్‌ మాస్టర్‌ మంజు, గణేష్‌, రామకష్ణ, తేజస్విని, నందిని తదితరులు పాల్గొన్నారు.