
వరి, అరటి, కాయగూర పంటలు ధ్వంసం
ప్రజాశక్తి - పాకాల
పాకాల మండలం ఇ.పాలగుట్టపల్లి పంచాయతీ పరిధిలో గురువారం రాత్రి ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేశాయి. అప్రమత్తమైన రైతులు అరుపులు, కేకలు, పెద్ద పెద్ద శబ్దాలతో అడవిలోకి దారి మళ్లించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తి గత కార్యదర్శి బొందు సుబ్రమణ్యంరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు ధైర్యం చెప్పి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అటవీ సిబ్బంది అక్కడకు చేరుకుని బాధిత రైతుల ద్వారా ఏనుగుల కదలికలను తెలుసుకున్నారు. ఆ తర్వాత పంట నష్టం అంచనా వేశారు. అనంతరం రైతులతో పాటు నష్టం జరిగిన పంట వివరాలను నమోదు చేసుకుని వెళ్లారు. ఏనుగుల దాడిలో వెంకట రామాపురానికి చెందిన బాలరాజు నాయుడు, పాలగుట్ట పల్లికి చెందిన రఘునాథరెడ్డి, గురప్ప నాయుడులు సాగు చేసిన వరి, టమోటా, అరటి పంటలను పూర్తిగా ధ్వంసం చేయడం తో తీవ్రంగా నష్టపోయామని అటవీ అధికారులకు తెలిపారు.