పంటలను పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు
ప్రజాశక్తి-తర్లుపాడు
ఎండిపోతున్న పంటలను కాపాడాలని, రైతులకు పంట నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని, మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు యేర్వ పాపిరెడ్డి, గుమ్మా బాలనాగయ్యలు డిమాండ్ చేశారు. బుధవారం వారు తర్లుపాడు మండలంలో పర్యటించి రైతులు సాగు చేసిన కంది, మిరప, పొగాకు, మినుము పంటలను పరిశీలించారు. వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయని రైతులు వారు దృష్టికి తెచ్చారు. కౌలు రైతులకు కౌలు కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలగట్ల సత్యనారాయణరెడ్డి, పిన్నిక ఆవులరాజు, యేర్వ వీరారెడ్డి, వెన్నా కోటయ్య తదితరులు పాల్గొన్నారు.










