పంట నమోదును పరిశీలిస్తున్న సురేష్ బాబు
ప్రజాశక్తి - దేవనకొండ
ఈఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేసుకున్న పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని ఎఒ సురేష్ బాబు తెలిపారు. శుక్రవారం పి.కోటకొండ గ్రామ శివారులో పంట నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. పంట నమోదు చేయించుకోకపోతే పంటల బీమా, బ్యాంకు రుణాలు పొందడంలో అనర్హులవుతారని తెలిపారు. పంటకు గిట్టుబాటు, మద్దతు ధర పొందాలంటే పంట నమోదు తప్పనిసరి అన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది లింగేశ్వరయ్య, రెడ్డి భీమన్న పాల్గొన్నారు.










