Jul 27,2023 20:36

చీని తోటను పరిశీలిస్తున్న డిప్యూటీ కమిషనర్‌

ప్రజాశక్తి - దేవనకొండ
ఉపాధి హామీ చట్టం కింద రైతులకు రాయితీపై అందిస్తున్న పండ్ల మొక్కలను సద్వినియోగం చేసుకుని పండ్ల తోటలతో అభివృద్ధి చెందాలని ప్లాంటేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ భవానీ సూచించారు. గురువారం మండలంలోని మాచాపురం గ్రామంలో మోహన్‌ రెడ్డి, శివారెడ్డి అనే రైతులు ఉపాధి హామీ చట్టం కింద సాగు చేసిన పండ్ల తోటల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు పండ్ల తోటల సాగుతో ఆర్థికంగా ఎదగాలన్నారు. ఏపీడీ పద్మావతి, ఎంపిడిఒ గౌరీదేవి, హార్టికల్చర్‌ మేనేజర్‌ నంద కిషోర్‌, సూపర్‌వైజర్‌ రత్నం, ఎపిఒ కృష్ణమూర్తి, టెక్నికల్‌ జెఇ రంగస్వామి, టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు నారాయణ స్వామి నాయక్‌, చిన్న గిడ్డయ్య పాల్గొన్నారు.