ప్రజాశక్తి - దేవనకొండ
మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో 'సే ట్రీస్' సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం 64 మంది రైతులకు 25 వేల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. మామిడి, బత్తాయి, జామ, ఉసిరి, అవకాడ్, దానిమ్మ, అంజూర, సీతాఫలం, టెంకాయ, టేకు, మహాగని, ఎర్రచందనం తదితర పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 'సే ట్రీస్' సంస్థ ప్రతినిధి శరణ్య మాట్లాడారు. రైతులు బహుళ అంతస్తుల పండ్ల తోటలు వేసి వాటి ద్వారా అధిక లాభాలు పొందడమే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. రైతులు పండ్ల తోటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచాలని సూచించారు. అనంతరం గతేడాది నాటిన పండ్ల తోటలను సందర్శించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ యూనిట్‌ను పరిశీలించారు. వైసిపి మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున మాట్లాడుతూ... రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సే ట్రీస్ సంస్థ 150 ఎకరాలకు మొక్కలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. ప్రోగ్రాం మేనేజర్ బి.నారాయణ, రిసోర్స్ పర్సన్ చింతమాను రవికుమార్, ఫీల్డ్ రిసోర్స్ పర్సన్ సుధాకర్, రైతులు పాల్గొన్నారు.
మొక్కలు పంపిణీ చేస్తున్న 'సే ట్రీస్' సంస్థ ప్రతినిధి శరణ్య










