అంగన్‌వాడీ స్టాల్స్‌ను పరిశీలిస్తున్న అధికారులు
ప్రజాశకి-కందుకూరు :జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం స్థానిక కోటు వారి స్ట్రీట్ పరిధిలో క్యాంపును మున్సిపాలిటీ ఆఫీస్‌లో గురువారం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా జరిగిన సభలో జెసిఎస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మహోత్తరమైందన్నారు. బాధిత ప్రజల ముంగిటకు వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. మున్సిపల్ మేనేజర్ చంద్రమోహన్ మాట్లాడారు. అంగన్‌వాడీ కార్యకర్తలు సూపర్ వైజర్ షకీలా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టి కాహారం ప్రాధాన్యత తెలియజేసే స్టాల్స్ ను పరిశీలించారు. మున్సి పల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ డియీ రమేష్ హెల్త్ ఆఫీసర్ బషీర్ సచి వాలయం అడ్మిన్ సెక్రటరీ పావని సచివాలయం కన్వీనర్లు గహ సారథులు ఉన్నారు.










