Oct 13,2023 21:12

పార్వతీపురం : కరపత్రాలు పంపిణీ చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ :  పట్టణంతో పాటు మండలంలో టిడిపి ఆధ్వర్యంలో బాబు తోనే నేను కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో పట్టణంలోని 15, 18 వార్డులతో పాటు పార్వతీపురం మండలం డోకిశిల, డికె పట్నం, బుదురువాడ పంచాయతీల్లో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ , మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు తో కలసి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ చంద్రబాబుపై వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సాగిస్తున్న కక్షపూరిత చర్యలు గురించి వివరిస్తూ వారి మద్దతు కూడగట్టారు. కార్యక్రమంలో నాయకులు ద్వారపురెడ్డి శ్రీదేవి, గొట్టాపు వెంకటనాయుడు, బార్నాల సీతారాం, బోను చంద్రమౌళి చంటి, కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, బడే గౌరీ నాయుడు, తాతపూడి వెంకటరావు, కోలా సరిత మధు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని ఎగువ తాడికొండలో బాబు నేను కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కురుపాం నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పాడి సుదర్శనరావు, ప్రధాన కార్యదర్శి పోలూరు శ్రీనివాసరావు, కురుపాం నియోజకవర్గ ఎస్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి అడ్డాకుల నరేష్‌, గుమ్మలక్ష్మీపురం మండల ఎస్టీ సెల్‌ అధ్యక్షులు తోయక కామేష్‌, ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు జయంత్‌, మాజీ సర్పంచ్‌ రామస్వామి, యూత్‌ ప్రెసిడెంట్‌ శివ, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
కుందర తిరువాడలో...
జియమ్మవలస మండలం కుందర తిరువాడ పంచాయితీ, నీచుకువలసలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ గురించి ఇంటింటికి వెళ్లి వివరించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పల్ల రాంబాబు, అరుకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎస్టీ సెల్‌ అరుకు పార్లమెంటు అధికార ప్రతినిధి నందివాడ కష్ణబాబు, మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాలూరు రూరల్‌ : .ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు ఎన్నాళ్లూ సాగవని నియోజక వర్గ టిడిపి ఇన్‌ఛార్జి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మండలంలోని కందులపదంలో బాబునేను కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చంద్రబాబుపై జరుగుతున్న కక్ష సాధింపు, అక్రమ కేసులు గురుంచి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు ఆమదాల పరమేశ్‌, బుస తవుడు, తాడుతూరి తిరుపతిరావు, అక్యన తిరుపతిరావు, శ్యామ్‌, నాగరాజు, మచ్చయ్య, మాలతిదొర, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు