Apr 04,2022 08:09

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి కొత్త జిల్లాలు ఉనికిలోని వచ్చాయి. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి విడుదల చేసిన తుది గెజిట్‌ నోటిపికేషన్‌ ఆధారంగా నూతన జిల్లా కేంద్రాల్లో అధికారయంత్రాంగం నేటి నుండి విధులు నిర్వహించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో గెజిట్‌లో పేర్కొన్న కలెక్టరేట్లలో సోమవారం ఉదయం కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్నారు. కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొట్టమొదటి అధికారిక కార్యక్రమంగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సిఎం కార్యాలయంలో  ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కొత్త జిల్లాల కలెక్టర్లకు సిఎం అభినందనలు తెలియచేసి, ప్రభుత్వ పాలనా ప్రాధాన్యతల గురించి దిశా నిర్ధేశం చేశారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే కలెక్టర్లు జిల్లాలోని వివిధ స్థాయిల అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు.

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివ శంకర్‌ నియామకం

పల్నాడు జిల్లా ఎస్పీగా రవిశంకర్‌రెడ్డి నియామకం

జిల్లా కేంద్రం: నర్సరావుపేట
అసెంబ్లీ నియోజకవర్గాలు : 7 (పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి)
రెవెన్యూ డివిజన్లు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త). మండలాలు : 28
గురజాల డివిజన్‌లో మండలాలు : గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారెంపూడి, బొల్లాపల్లి
సత్తెనపల్లి డివిజన్‌లో మండలాలు : సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, పెదకూరపాడు, బెల్లంకొండ, నకిరేకల్లు
నర్సరావుపేట డివిజన్‌లో మండలాలు : చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, నర్సరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, నూజెండ్ల, శావల్యపురం, ఈపూరు
విస్తీర్ణం : 7,298చ.కిమీ.  జనాభా: 20.42 లక్షలు

పల్నాడు జిల్లా