Nov 11,2023 21:23

ప్రజాశక్తి-వి.కోట: మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే వెంకటేగౌడ, చిత్తూరు జెడ్పి చైర్మన్‌ శ్రీనివాసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహి ంచారు. వికోట సచివాలయ పరిధిలోని కాజిపేట లో తొలతగా గ్రామస్తులతో సమావేశమయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోనే నిద్రిం చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మమ్మ, వైసిపి నాయకులు నాగరాజు, బాలగురునాథ్‌, గౌస్‌, అక్మల్‌, తమీంఖాన్‌, కిషోర్‌గౌడ్‌, కుమార్‌రాజా, హరి, బాబు తదితరులు పాల్గొన్నారు.