May 13,2023 22:01

నిరసన వ్యక్తం చేస్తున్న 104 ఉద్యోగులు

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌ : రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు 104 సిబ్బంది చేపట్టిన సమ్మె, నిరసన దీక్షలు శనివారానికి ఏడో రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా సిబ్బంది వినూత్నంగా తమ డిమాండ్లతో కూడిన ప్ల కార్డులను 104 వాహనాల ముందు ప్రదర్శించారు. 104ను ప్రయివేటీకరణ చేయకుండా ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ సక్రమంగా అమలు చేయాలని, బఫర్‌ ఉద్యోగులకు బకాయిలు, ట్రావెలింగ్‌ అలవెన్స్‌ చెల్లించాలని కోరారు. బదిలీ సౌకర్యం కల్పించాలని, 3 నెలలకు ఒకసారి యాజమాన్య ప్రతినిధులతో ఎంప్లాయిస్‌ గ్రీవెన్స్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పుట్టపర్తిలో నిర్వహించిన నిరసన దీక్షలో డైవర్‌ మోహన్‌, లక్ష్మీపతి పాల్గొన్నారు.