Aug 27,2023 21:19

మర్రివానివలసలో పూరిల్లులోనే ఉంటున్న గిరిజనులు

ప్రజాశక్తి - మక్కువ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పుష్కరకాలం పూర్తయినా, తెలుగుదేశం ప్రభుత్వం మారి వైసిపి ప్రభుత్వం వచ్చినా వారికి అవస్థలు మాత్రం తప్పడం లేదు. గతంలో టిడిపి హయాంలో ఇందిరమ్మ లబ్ధిదారుల గృహాలకు నిధులు మంజూరు చేయలేదు. అప్పటితో ఒకటి, రెండు బిల్లులతో అసంపూర్తిగా కొందరు ఇళ్లు నిలిచిపోగా, మరికొందరు మంజూరైనా పూరిపాకలోనే గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న కాలనీలో ఊరోరా ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ ఈ లబ్ధిదారులకు మాత్రం చోటు దక్కలేదు. దీంతో మండలంలో సుమారు 1031 మంది ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు అవస్థలు పడుతూనే ఉన్నారు. అయినా ఏ ఒక్క ప్రభుత్వం కూడా వీరిని దృష్టిలో పెట్టుకోకుండా కొత్తవారికే ఇళ్లు మంజూరు చేస్తూ వస్తున్నారు. దీంతో అర్హత ఉన్నా గృహాల్లేక ఎన్నో ప్రయాసలకు గురికావలసి వస్తుందని వీరంతా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత లబ్ధిదారులకు గృహాలు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.