Jun 05,2023 23:04

సమస్యను ఎమ్మెల్యేకు వివరిస్తున్న మహిళ

కదిరి టౌన్‌ : పట్టణంలోని 24వ వార్డులో సోమవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నజీమ్‌ మున్నీసా సాదిక్‌, మాజీ వైసిపి సమన్వయకర్త ఇస్మాయిల్‌, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కో ఆప్షన్‌ సభ్యులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.