Sep 01,2023 21:43

సచివాలయంలో పింఛన్‌ కోసం వేచి ఉన్న వృద్ధులు

        ప్రజాశక్తి-బొమ్మనహాల్‌   పింఛను సొమ్ము కోసం లబ్ధిదారులు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ సచివాలయాల వద్ద పడిగాపులు కాచారు. బొమ్మనహాల్‌లో 22 మంది వాలంటీర్లు ఉన్నా ఇంటి వద్దకే వెళ్లి పింఛను మొత్తాన్ని అందివ్వాలని ఆదేశాలు ఉన్నా అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నారు. దీంతో వృద్ధులు నానా అవస్థలు పడి సచివాలయం వద్దకు చేరకుని పింఛను సొమ్ముపై పంచాయతీ కార్యదర్శులను ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. గ్రామంలో వివిధ రకాల పింఛన్లు 450 ఉండగా 1వ తేదీ కేవలం 50 మందికి మాత్రమే పింఛన్ల సొమ్ము అందిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన వారికి 5వ తేదీ లోపు పూర్తి చేస్తామంటూ పంచాయతీ కార్యదర్శి బాబాఫకృద్దీన్‌ తెలిపారు. పింఛన్ల పంపిణీపై ఎంపిడిఒ షకీలా బేగంను వివరణ కోరగా గత నెలలో అందరికీ పంపణీ చేశామని, ఎవరికీ పెండింగ్‌ లేవని తెలిపారు.