Nov 07,2023 23:50

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే సిబ్బంది టైం ప్రకారం విధులకు హాజరుకావాలని, ప్రతిరోజూ ముఖ ఛాయా చిత్ర హాజరు వేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి ఆదేశించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్‌ సహాయకులు, సీనియర్‌ సహాయకులకు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ అందరు టైం ప్రకారము వస్తున్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత సీనియర్‌ సహాయకులు మరియు డాక్టర్‌దేనన్నారు. పరిపాలన అధికారి గీతాంజలి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో హెచ్‌డిఎస్‌ ఫండ్స్‌ ను కమిటీ వేసుకొని అవసరమైన వాటికి నిధులు ఖర్చు చేయాలన్నారు. ఆరోగ్య ఆసరా పథకం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేయాల్సిన బాధ్యత జూనియర్‌ సహాయకులు మరియు సీనియర్‌ సహాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకౌంటెంట్‌ రాజేష్‌, సూపరిటెండెంట్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్‌ రాజ్యలక్ష్మి