మృతి చెందిన గొర్రెలు
సాలూరు రూరల్: మండలంలోని మరిపల్లి పంచాయతీ వెలగవలస వద్ద శనివారం కురిసిన భారీ వర్షంతోపాటు పిడుగు పడడంతో 8 మేకలు మృతి చెందాయి. మరిపల్లికి చెందిన మీసాల సత్యం, కోండ్రు తిరుపతి తమ మేకలను మేపేందుకు వెలగవలస సమీపానికి తోలుకెళ్లారు. వర్షంతో పాటు ఈదురు గాలులు వీయడంతో భయపడి స్థానిక బంగరమ్మ గుడి వద్ద మేకలను నిలబెట్టారు. అంతలో పిడుగు పడడంతో 8 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.










