మృతి చెందిన సింహాచలం
వీరఘట్టం : మండలంలోని తెట్టంగికి చెందిన ముదిలి సింహాచలం (39) పిడుగు పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నవగాంలో నిత్యవసర వస్తువులు కొనుక్కొని తిరిగి ఇంటికి ప్రయాణమైన సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య లక్ష్మి, కుమార్తె, 7నెలల కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










