ఇన్‌చార్జ్ కలెక్టర్ అపరాజిత సింగ్
ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : పిడిఎస్ బియ్యాన్ని ఎవరైనా అక్రమ నిల్వ చేసిన ,రవాణా చేసిన ఖరిన చర్యలు తప్పవని ఇన్‌చార్జ్ కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ స్పష్టం చేశారు. బందర్ డివిజన్లో గత కొంతకాలంగా పి డి ఎస్ బియ్యాన్ని, అక్రమ రవాణా చేస్తున్న మరియు అక్రమంగా నిల్వచేసిన బియ్యాన్ని డివిజన్లోని పౌరసరఫరాల అధికారులు సీజ్ చేశారు. ఆ ప్రకారం సీజ్ చేసి నిలువ ఉన్న 62 టన్నుల బియ్యాన్ని నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ ఆధ్వర్యంలో తొలిసారిగా బహిరంగ వేలం వేశారు. వేలంలో అధిక ధరకు పాడుకున్న వారికి ఆ బియ్యాన్ని అప్పగించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌ఓ పార్వతి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ డాక్టర్ ఏ. శ్రీధర్ తదితర అధికారులు కొనుగోలుదారులు పాల్గొన్నారు.










