Oct 31,2023 23:42

ప్రజాశక్తి - పెరవలి పెరవలి గ్రామంలో ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస నాయుడు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయం, ఆర్‌బికె, హెల్త్‌ క్లినిక్‌ భవనాలను ఆయన ప్రారంభించారు. అలాగే ఎస్‌సి ప్రాంతం లో కల్వర్ట్‌ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పెరవలి, ముక్కామల గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గంగోలు సీతమ్మ, ఎంపిపి కె.సీతారాం ప్రసాద్‌, వైసిపి నాయకులు వి.సత్యనారాయణ, పి.భద్రయ్య, స్వాతి బాలకృష్ణ, ఎంపిటిసి ఆర్‌.ప్రమీల కుమారి, తహశీల్దార్‌ టి.రాజేశ్వరి ఎంపిడిఒ డి.దామోదర్రావు, వ్యవసాయ అధికారి మేరీ కిరణ్‌, తదితరుతు పాల్గొన్నారు.