కోళ్లను పంపిణీ చేస్తున్న అధికారులు
ప్రజాశక్తి- దేవనకొండ
ప్రభుత్వం అందిస్తున్న పెరటి కోళ్లను లబ్ధిదారుల సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని జడ్‌పిటిసి కిట్టు, వైసిపి మండల కన్వీనర్ కప్పట్రాళ్ల మల్లికార్జున తెలిపారు. శనివారం వైఎస్‌ఆర్ క్రాంతి పథం కార్యాలయ ఆవరణలో ఎఒ సురేష్ బాబు, ఎపిఎం రమేష్ ఆధ్వర్యంలో మండలంలో 100 యూనిట్లు పెరటి కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒక యూనిట్ ధర రూ.3,250 ఉంటుందని, ఇందులో 8 కోడి పెట్టెలు, 3 పుంజులు ఉంటాయని తెలిపారు. ఆరోగ్య రీత్యా పెరటి కోళ్లు పెంచుకొని వాటి ద్వారా వచ్చే గుడ్లు, వాటి మాంసం తింటే మంచిదని చెప్పారు. హెచ్‌డిసిసి నరసన్న, జిసిసిలు మధు, స్వామన్న, అకౌంటెంట్ శివ పాల్గొన్నారు.










