Sep 02,2023 21:04

రైతులకు పెరటి కోళ్లను పంపిణీ చేసుత్న్న కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం డైరెక్టర్‌ ఎస్‌ఎన్‌.మల్లేశ్వరి

              ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం   పెరటి కోళ్ల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం పోగ్రాం డైరెక్టర్‌ ఎస్‌ఎన్‌.మల్లేశ్వరి సూచించారు. శనివారం మండలంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో కెవికె దత్తత గ్రామాలకు చెందిన రైతులకు పెరటి కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పెరటి కోళ్ల పెంపకం, డైరీ యూనిట్‌ ఏర్పాటు, వీటిలో మెళకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోళ్ల పెంపకంలో కొక్కెర తెగుళ్లు, నులి పురుగులు, ఖనిజ లవణాల లోపాల సమస్యలు ఉన్నాయన్నారు. వీటి నుంచి కాపాడుకుంటే అధిక ఆదాయం పొందవచ్చన్నారు. ప్రస్తుత కాలంలో పెరటి కోళ్ల పెంపకం నుంచి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. నాటుకోళ్ల మాంసం, గుడ్డు వంటి వాటిలో పోషక విలువలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం అసోసియేట్‌ డైరెక్టర్‌ ఎన్‌సి.వెంకటేశ్వర్లు, కెవికె శాస్త్రవేత్తలు కె.మాధవి, బి.చందన, నవీన్‌ కుమార్‌, సిద్ధరాచర్ల, గొల్లపల్లి, సోధనపల్లి, ఈస్ట్‌ నరసాపురం, పోతురాజుకాలవ రైతులు పాల్గొన్నారు.