కరపత్రాలు అందజేస్తున్న నాయకులు
ప్రజాశక్తి - రొద్దం : రాష్ట్రంలో నిత్యావసర వస్తువులపై పెరిగిన ధరలు ప్రజలకు భారంగా మారాయని టిడిపి నాయకులు అన్నారు. శనివారం మండలంలోని పెద్దకోడిపల్లిలో నిర్వహించిన ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి అనే కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో కూడిన కరపత్రాలతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న ముత్యాలప్ప, గోపాల్, నరసింహులు, బత్తప్ప, నాగప్ప, క్రిష్టప్ప, గోపాల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










