Apr 21,2023 21:49

రోడ్డు ఏర్పాటు చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి రొద్దం : మండలంలోని పలు గ్రామాలు పెన్నానదికి సమీపంలో ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాలకు పెన్నానదిలో రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం నల్లూరు, కల్లుకుంట గ్రామాలకు మధ్య ఉన్న పెన్నానదిలో రోడ్డు వేశారు. తాజాగా శుక్రవారం రొద్దం నుంచి చిన్నకోడిపల్లి వెళ్లే దారిలో పెన్నానదిలో రొద్దం సర్పంచ్‌ రూప, ఎంపీపీచంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో సర్పంచ్‌ నిధులతో నదిలో మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. దీంతో చిన్నకోడిపల్లి చోలెమర్రి గ్రామాల ప్రజలకు కొద్దిపాటి సమస్య తొలగిందని ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గోపాల్‌, రెడ్డి,మారుతీ, నరసింహారెడ్డి, వార్డ్‌ మెంబర్‌ శంకర, శేషు, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.