Jun 13,2023 22:25

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : పట్టణంలోనిఅగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు, కార్మికులు కోరారు. ఈమేరకు వారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సంపత్‌ కుమార్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందన్నారు. ఇప్పటికైనా వెంటనే పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని పిఎఫ్‌ వివరాలు స్లిప్పులు సకాలంలో ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్‌. నరసింహులు, నాయకులు జగన్మోహన్‌, రామ్మోహన్‌, ఫైరోజ్‌, గంగప్ప, విజయలక్ష్మి, శారద, ఫాతిమా లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.