ప్రజాశక్తి - పెనుకొండ : రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారథి విమర్శించారు. మంగళవారం పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ పార్థసారథి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు విద్యుత్ చార్జీల పెంపు, అనధికార విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోలన నిర్వహించారు. ఈ సందర్భంగా బికె మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 7 సార్లు ప్రజలపై విద్యుత్ చార్జీలు పెంచి రూ. 37000 కోట్ల అదనపు భారం మోపిందనానరు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించాలని ప్రణాళిక సిద్ధం చేశారని, రైతులు మోటార్లకు మీటర్లు బిగించడానికి వస్తే మీటర్లు ధ్వంసం చేయాలని అనానరు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, అనధికార విద్యుత్ కోతలను ఆపి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ, టీడీపీ నాయకులు చిన్నవెంకటరాముడు, రామక్రిష్టప్ప, కేశవయ్య, రఘువీర చౌదరి, అశ్వర్థనారాయణ, హుజూర్, రామలింగనాయుడు, శ్రీనివాసులు, బోయ నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గోరంట్ల : విద్యుత్ కోతలు, ఛార్జీల పెంపునకు నిరసనగా పట్టణంలో గుమ్మయపల్లి సబ్‌స్టేషన్ వద్ద టిడిపి నాయకులు మంగళవారం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు, విద్యుత్ కోతలు వలన రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ట్రాన్స్‌కో ఎఇ శ్రీనివాస్‌కు అందజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ సోమశేఖర్. హిందూపురం పార్లమెంట్ టిడిపి కార్యదర్శి దేవా నరసింహప్ప, మండల ప్రధాన కార్యదర్శి అశ్వర్థరెడ్డి, నాయకులు నీలకంఠ రెడ్డి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
మడకశిర రూరల్ : పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మడకశిర పట్టణంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మంగళవారం స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలన్నారు. విద్యుత్‌కోతలతో మల్బరి, వక్క తోటలు, పత్తి, వేరుశనగ పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లో వోల్టేజీతో రైతుల మోటర్లు కాలిపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, ఐదు మండలాల కన్వీనర్లు, టిడిపి నాయకులు , కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రొద్దం. విద్యుత్ చార్జీల పెంపు, అనధికార విద ు్యత్ కోతలకు నిరసనగా టిడిపి ఆధ్వర్యంలో స్థానికవిద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి హిందూపురం పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, జిల్లా అధికార ప్రతినిధి నరసింహులు, తాలుకా అధ్యక్షులు చిన్నప్పయ్య, మండల కన్వీనర్ నరహరి, మాజీ సర్పంచి అశ్వర్థనారాయణతో పాటు అధికసంఖ్యలో నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.










