Jul 08,2023 20:06

వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితరులు

పేదవాడి గుండె చప్పుడు వైఎస్‌ఆర్‌
- ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి
- జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     పేదవాడి గుండె చప్పుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ అని, సంక్షేమంతో చరిత్రలో చెరగని ముద్ర వేశారని ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషాలు వైఎస్‌ఆర్‌ సేవలను కొనియాడారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ 74వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వైయస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు, ఉమ్మడి ఎపి సిఎంగా రెండుసార్లు బాధత్యలు స్వీకరించి, తన సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి వైఎస్‌ఆర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మాబున్నీసా, రాష్ట్ర దృశ్య కళల డైరెక్టర్‌ సునీత అమృతరాజ్‌, శాంతిరాం విద్యాసంస్థల డైరెక్టర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు కోఆప్షన్‌ సభ్యులు, వార్డు ఇన్చార్జీలు, వైసిపి నాయకులు పాల్గొన్నారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో వైసిపి మండల కన్వీనర్‌ కొమ్మా మహేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌బికె వద్ద వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్ర గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ డైరెక్టర్‌ నాగభూపాల్‌ రెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు కుంచేపు లక్ష్మీనరసమ్మ, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ శరభారెడ్డి, సర్పంచులు కందుల వరలక్ష్మి, సుదర్శన్‌ పాల్గొన్నారు. అవుకు పట్టణంలో ఎంపీపీ చల్లా రాజశేఖర్‌ రెడ్డి సోదరులతో కలిసి వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రహదారుల కూడలిలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డిలు నివాళులర్పించారు. నంద్యాల విజయ మిల్క్‌ డైరీ చైర్మన్‌ ఎస్వి జగన్మోహన్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాయబ్‌ రసూల్‌, ఎంపిపి గజ్జల రాఘవేంద్ర రెడ్డి, మాజీ మార్కెట్‌ యార్డ్‌ వైస్‌ చైర్మన్‌ కూలూరు నరసింహ రెడ్డి, దాల్‌ మిల్‌ గఫూర్‌, బద్రి సుధాకర్‌ రెడ్డి, కాంట్రాక్టర్‌ నజీర్‌, బద్రి భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. బనగానపల్లె రూరల్‌ : మండలంలోని పలుకూరు గ్రామంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి గుండం శేషిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుండం నాగేశ్వర రెడ్డిల ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకులు గుండం భాస్కర్‌ రెడ్డి, ఎస్‌విఆర్‌ విద్యాసంస్థల అధినేత శనివారపు వెంకటరామిరెడ్డి, సచివాలయం కన్వీనర్‌ వెంకటసుబ్బారెడ్డి, మండ్ల భూపాల్‌ రెడ్డి, కాటసాని పుల్లారెడ్డి, సచివాలయ కన్వీనర్‌ వడ్డే వెంకటేష్‌, తెలుగు వెంకట గురువయ్య, జగదీశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు. సంజామల మండలంలోని అన్ని గ్రామాల్లో వైసిపి నాయకులు వైయస్సార్‌ 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి, విగ్రహానికి నివాళ్లులర్పించారు. బనగానపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నివాసంలో వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కాటసాని ఓబుల్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, బాలింతలకు వారు పండ్లు, బ్రెడ్‌ పంపిణీ చేశారు. షేక్‌ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ అబ్దుల్‌ ఖైర్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దీవెనమ్మ, జడ్పిటిసి సుబ్బ లక్ష్మమ్మ, పట్టణ సర్పంచ్‌ ఈసారి ఎల్లమ్మ, నాయకులు అబ్దుల్‌ ఫైజ్‌, డాక్టర్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ ,ఈసారి ఎల్లయ్య, కిషోర్‌, జిల్లెల్ల శంకర్‌ రెడ్డి, వార్డ్‌ మెంబర్‌ సురేష్‌, ఎంపిటిసి వెంకట సుబ్బయ్య, సైకిల్‌ షాప్‌ మహబూబ్‌ వలి, విఠలాపురం వీరారెడ్డి, సజ్జాథ్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.