Oct 16,2023 19:55

ప్రజలకు మందులను పంపణీ చేస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - మంత్రాలయం
పేదకు 'జగనన్న ఆరోగ్య సురక్ష' ఒక వరం లాంటిదని సర్పంచి వీరారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని వి.తిమ్మాపురం ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన 'జగనన్న ఆరోగ్య సురక్ష'లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' ద్వారా మండల వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది బిపి, షుగర్‌, రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం వంటి 9 పరీక్షలను చేసి తగిన మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో మూడు రోజులుగా దండోరా వేయించి ప్రజలకు సమాచారం అందించామని పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శి వీరేష్‌ ప్రజలను చైతన్యం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. కలుదేవకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ భావన, కాచాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి వసంత, 104 డాక్టర్‌ రాణి, సిబ్బంది భారతి, సుశీల, విజయలక్ష్మి, రంగమ్మ, మహిళా పోలీసు వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్‌ సుజాత, విఆర్‌ఎ నరసప్ప, పోలీసు సిబ్బంది చెన్న బసప్ప, దశరథ రాముడు పాల్గొన్నారు.