పేదలకు మెరుగైన వైద్యం
ప్రజాశక్తి-బిట్రగుంట : రాష్ట్రంలో ప్రతి పేదవాళ్లకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చెన్నారాయినిపాలెంలో సోమవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బాబు ఆధ్వర్యంలో ఎంపిడిఒ వెంకట సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎ రామిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదవారి కోసం సంక్షేమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతిఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలందే విధంగా వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, సిఆర్ పాలెం, డాక్టర్ సీమ తపస్సు, మండల యువత నాయకులు మేకల శ్రీనివాసులు, స్థానిక నాయకులు పవన్‌కుమార్ రెడ్డి, రాఘవేంద్ర, వ్యవసాయ సహాయకులు దీప్తి, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.










