ప్రజాశక్తి - నందవరం
రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని వైసిపి బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు, ముగతి సర్పంచి ముగతి విరుపాక్షిరెడ్డి, గురజాల సర్పంచి విరస్వామి తెలిపారు. శుక్రవారం మండలంలోని ముగతి, గురజాల గ్రామాల్లో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కుల, మత, వర్గ, పార్టీ భేదం లేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని, అర్హత ఉన్న వారు నేరుగా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. డయాలసిస్‌తో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.10 వేలు పింఛను అందిస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, వైసిపి నియోజకవర్గ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో అందరికీ పథకాలు అందించేలా చర్యలు చేపట్టారన్నారు. డయాలసిస్‌తో బాధపడుతున్న గొల్ల రంగన్నకు రూ.10 వేల పింఛను అందజేశారు. వైసిపి నాయకులు రాజారెడ్డి, నరసింహారెడ్డి, చిన్న నరసింహులు, జాను పాల్గొన్నారు.
పింఛన్లను అందజేస్తున్న సర్పంచి విరుపాక్షి రెడ్డి










