ప్రజాశక్తి, కదిరి టౌన్ :పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యే సిద్దారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని కంచుకోట, శివాలయం స్ట్రీట్, ఎమ్‌జి రోడ్డు వార్డు సచివాలయాల పరిధిలో, రూరల్ మండలం కదిరి బ్రాహ్మణపల్లి గ్రామ సచివాలయ పరిధిలో శుక్రవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి పేదవాడికిఉచితంగా ప్రభుత్వ సేవలను అందజేయడం జరుగుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నజీ మున్నిసా సాధిక్, కౌన్సిలర్లు, సర్పంచులుతో పాటు ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ : రూ.20 లక్షల జెడ్పీ నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ శుక్రవారం భూమి పూజ చేశారు. కదిరి రూరల్ ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం వద్ద ఈ పనులను ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ నిధుల నుండి రూ. 20 లక్షల రూపాయలు విడుదల చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అని గ్రామస్తులు అన్నారు. నాణ్యతలో ఎటువంటి రాజీలేకుండా నిర్మాణం చేపట్టిన ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి స్థానిక సర్పంచును అబినందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బత్తలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల ఇంటివద్దకే సేవలు అందిస్తున్నట్లు ధర్మవరం ఆర్డీవో తిప్పేనాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని తంబాపురం గ్రామ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సర్పంచులు సానే. ఆజయచంద్రారెడ్డి, కంచనగారి రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సభకు ముఖ్యఅతిథులుగా ఆర్టీవో తిప్పేనాయక్, తహశీల్దార్ యుగేశ్వరిదేవి, ఈవోఆర్డీ దివాకర్, ఎంపీపీ బగ్గిరి త్రివేణి, జెడెడ్పీటీసీ కోటి సుధ, ఎంపిటీసీలతో పాటు సభ్యులు బొడ్డు నాగేంద్ర, బగ్గిరి బయపరెడ్డి సచివాలయాల మండల కన్వీకర్ జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా దరఖాస్తు చేసుకున్న వారికి 811 ధ్రువీకరణ పత్రాలను ప్రజలకు అందజేశారు.. ఈ కార్యక్రమంలో కార్యద నారాయణరెడ్డి, సీతారామిరెడ్డి, బాలిరెడ్డి, రమేష్ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు
హిందూపురం :ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన జగనన్న సురక్ష'కార్యక్రమం ద్వారా పౌరసేవలన్నీ వేగవంతంగా అందుతాయని హిందూపురం నియోజక సయన్వయ కర్త దీపిక అన్నారు. శుక్రవారం పురపాలక సంఘ పరిధిలోని కోట, బోయపేట సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమాల్లో వైస్‌ఛైర్మన్ బలరామిరెడ్డితో కలిసి దీపిక పాల్గొన్నారు. ఈ సందర్బంగా దీపిక మాట్లాడుతు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రభుత్వం లేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమానికి పడుతున్న తపన చూస్తుంటే మరో 30 ఏళ్లు ఆయనే పాలిస్తాడనే ధీమా వస్తుందని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, వార్డు కౌన్సిలర్లు షాజియా, మల్లికార్జున, ఆసీఫ్‌వుల్లా, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, తహశీల్దార్ హసీనా సుల్తాన, వైసిపి నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శంకర నారాయణ పేర్కొన్నారు. పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని సచివాలయం-5లో శుక్రవారం నిర్వహించిన 'జగనన్న సురక్ష' కార్యక్రమంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వంశీ కష్ణ భార్గవ, మున్సిపల్ ఛైర్మన్ ఫరూక్, వైస్ ఛైర్మన్ సునీల్, జడ్పీటీసీ శ్రీరాములు, ఎంపీపీ గీతారామ్మోహన్‌రెడ్డి, టౌన్ కన్వీనర్ నరసింహా, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం 'జగనన్న సురక్ష' కార్యక్రమం చేపట్టిందని ఎంపీపీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెద్దమంతూరు సచివాలయంలో శుక్రవారం ఎంపీపీ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు 11 రకాల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ అనంతాచారి, డిఎల్‌పిఓ, ఎంపీడీవో రాబర్ట్‌విల్సన్, ఈఒఆర్‌డి కేశవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి బాబు, పెద్దమం తూరు సర్పంచి అశ్వర్థమ్మ, ఎంపిటిసి గంగమ్మ, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బి.నారాయణరెడ్డి, చెరుకూ రు సుభాషిణి, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల రూరల్ : మండల పరిధిలోని వడిగేపల్లి, నార్సింపల్లి, బూదిలి, పాపిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎంపీడీవో రఘునాథ్‌గుప్తా, సర్పంచుల ఆధ్వర్యంలో 'జగనన్న సురక్ష'పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బూదిలి సర్పంచి రామాంజనేయులు, నార్సింపల్లి, వడిగేపల్లి, బూదిలి సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.










