Oct 21,2023 23:25

గడప గడపకూలో ఎమ్లెల్యే నాగార్జున రెడ్డి

ప్రజాశక్తి-పొదిలి : పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే థ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పనిచేస్తున్నట్లు మార్కా పురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి తెలిపారు. మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడప గడపకూ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలు వివరించారు. ప్రజలు కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తొలుత మాజీ సర్పంచి ఉలవా గోపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఏసేబు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డైరక్టర్‌ కసిరెడ్డి వెంకట రమణారెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాస రెడ్డి, వైసిపి సేవాదళ్‌ అధ్యక్షుడు గుజ్జుల సంజీవ రెడ్డి, వైసిపి మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి శ్రీనివాస రెడ్డి, వైసిపి నగర పంచాయతీ అధ్యక్షురాలు ఎస్‌కె.నూర్జాహాన్‌ బేగం, గొలమారి చెన్నారెడ్డి, శ్రీను, కాంట్రాక్టర్‌ కల్లం వెంకట సుబ్బారెడ్డి, గూడూరి వినోద్‌ కుమార్‌, కృష్ణ, ఇఒఆర్‌డికృష్ణ, ఎఒ జైనులాబ్దిన్‌, వైసిపి నాయకులు కె వెంకటేశ్వర్లు, ఉలవ పెద్దబ్రహ్మయ్య, కె చిన్న వెంకటేశ్వర్లు, గోగినేని ముసలయ్య, కల్లూరు బసవయ్య, ఉప్పలపాడు గ్రామ వైసిపి అధ్యక్షుడు కె. చిన్న వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.