పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
ప్రజాశక్తి-ఆదోనిరూరల్
పేదల సంక్షేమమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకు పెద్ద ఎత్తున పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. గురువారం ఎమ్మెల్యే స్వగృహంలో దానమ్మ, ఎంపిడిఒ గీతావాణి ఆధ్వర్యంలో 35 సచివాలయాల్లో 592 మందికి నూతన పింఛన్లు ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభాగ్యులైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసిపి అని తెలిపారు. పింఛను రానివారు అధైర్యపడవద్దని, అర్హులందరికీ పింఛన్లు వస్తాయని చెప్పారు. దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు.










