Apr 08,2023 22:46

gantasala mandalam lo

పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత : వైసిపి
ప్రజాశక్తి-యంత్రాంగం
రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం నిరంతరం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందనీ, నవరత్న పథకాల ద్వారా అన్ని తరగతుల ప్రజలకు మేలు చేస్తోందని ఆ పార్టీ నాయకులు అన్నారు. వైసిపి ఆధ్వర్యంలో 'మా నమ్మకం నువ్వే జగనన్న' కార్యక్రమాలు జిల్లాలో పలుచోట్ల శనివారం జరిగాయి.
ఘంటసాల : మండలం శ్రీకాకుళం గ్రామంలో 'మా నమ్మకం నువ్వే జగనన్న' కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూటికి 90 శాతం కుటుంబాలకు సీఎం జగనన్న కార్యక్రమాలు వల్ల మేలు జరిగిందన్నారు. సాధాణంగా అధికారంలో ఉన్న పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉంటారన్నారు. అలా కాకుండా నిత్యం ప్రజల్లో ఉండాలని,వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టారన్నారు. జడ్పీటీసీ తుమ్మల మురళి, ఏఎంసి చైర్మన్‌ వేమూరి వెంకట్రావు, మండల సచివాలయాల కన్వీనర్‌ వేమూరి ప్రవీణ్‌, పిఏసిఎస్‌ అధ్యక్షులు వేమూరి రత్నశేఖర్‌, బసవయ్య, వైస్‌ ఎంపీపీ కుంపటి నాగేంద్ర బాబు, సర్పంచ్‌ రాచూరిప్రసాద్‌ బాబు, వైసీపీ నాయకులు చిట్టూరి రమేష్‌ - చిట్టితల్లి , సచివాలయం కన్వీనర్‌, గృహసారధులు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్‌ జంక్షన్‌ : ప్రజలు సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకునేందుకే నేరుగా ప్రజలతో మమేకమయ్యే బహత్తర కార్యక్రమమే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం అని రాష్ట్ర నాటక రంగ డైరెక్టర్‌ నక్క గాంధీ అన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై శనివారం బాపులపాడు లో జగనన్న ఇంటింటికి కార్యక్రమం నిర్వహించారు. బాపులపాడు పి.ఎ.సి.ఎస్‌ అధ్యక్షుడు యర్రంశెట్టి వెంకట రామాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యురాలు కొమరవెల్లి గంగా భవాని, మండల పార్టీ కన్వీనర్‌ అవిర్నేనీ శేషగిరి, మండల ఎంపిపి యర్రగొర్ల నగేష్‌ , కాకులపాడు కానుమోలు పెరికీడు గ్రామల సర్పంచ్‌ లు గ్రామ వార్డు నెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్షుడు పార్టీ కార్యకర్తలు మండల స్థాయి నాయకులు బ్యాంకు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ : వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను ఆధ్వర్యంలో శనివారం స్థానిక 32,35 వార్డులో మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ వైసిపి ప్రధాన కార్యదర్శి చింతల భాస్కరరావు, మాజీ కౌన్సిలర్‌ వీరిశెట్టి నరసింహారావు, నాయకులు, గహ సారధులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఉయ్యూరు: బోళ్లపాడులో మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమాన్ని సర్పంచ్‌ తుమ్మూరు సురేశ్‌ రెడ్డి ప్రారంభించారు. ఎంపిటీసీ గంగారత్నం, పార్టీ నాయకులు సంజీవరెడ్డి, వల ంటీర్లు, గృహసారధులు, కన్వీనర్లు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉయ్యూరు నగరపంచాయతీ పరిధి 2,4,6,7,14, 16 వార్డుల్లో మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు జంపాన కొండలరావు, నగర పంచాయతీ వైస్‌ చైర్మన్‌ సోలె సురేశ్‌ బాబు, వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెదపారుపూడి : మండలంలోని పాములపాడు సచివాలయ పరిధిలో దూళవానిగూడెంలో మా నమ్మకం నీవే జగన్‌ కార్యక్రమం జరిగింది. గహ సారథులు, వాలంటీర్ల సమక్షంలో వైసిపి సీనియర్‌ నేత చిగురుపాటి శ్రీధర్‌, సచివాలయ కన్వీనర్‌ సోడా బత్తిన అరుణకుమారి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి వివరించారు. పమిడిముక్కల : మండలంలోని హనుమంతపురంలో గ్రామ సర్పంచ్‌ కలపాల రాంబాబు ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఎం జగన్‌, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ప్రజలకు చేస్తున్న మేలును వివరించారు. పమిడిముక్కల మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు కొడమంచిలి మహేష్‌, జె.సీతారామయ్య, నాయకులు కొండేటి సుబ్రహ్మణ్యం, ఇంటూరి నాగేశ్వరరావు, శొంఠి మామూళ్లేశ్వరరావు, కొడాలి నాగమణి, తంగిరాల భాగ్యశ్రీ, వైసిపి కన్వీనర్లు, గృహసారధులు, వాలంటీర్లు పాల్గొన్నారు.