Sep 16,2023 22:05

ఇంటిపట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్‌

        ప్రజాశక్తి-కళ్యాణదుర్గం   రాష్ట్రంలో పేదల పక్షపాతి ముఖ్యమంత్రి జగనన్న అని మంత్రి ఉషశ్రీ చరణ్‌ అన్నారు. శనివారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శెట్టూరు మండల పరిధిలోని అయ్యగార్లపల్లి గ్రామ ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలు సూచించిన వారికే ఇళ్లు మంజూరయ్యేవన్నారు. అయితే వైసిపి వచ్చాక అర్హులందరికీ స్థలాలతోపాటు ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శెట్టూరు మండల వైసీపీ నాయకులు, హౌసింగ్‌ సిబ్బంది, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.