Oct 07,2023 17:51

సమస్యలు తెలుసుకుంటున్న జయమనోజ్‌రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
'జగనన్న ఆరోగ్య సురక్ష' ప్రవేశపెట్టి పేదల ఆరోగ్యమే ధ్యేయంగా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని వైసిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ జయ మనోజ్‌ రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ నరసింహులు తెలిపారు. శనివారం ఆదోనిలోని నిజాముద్దీన్‌, మైనార్టీ కాలనీల్లో 'గడప గడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. జయమనోజ్‌రెడ్డి కౌన్సిలర్‌ ఫయాజ్‌తో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి నిరుపేద ఆరోగ్యంగా ఉండాలని 'ఆరోగ్య సురక్ష' చేపడుతున్నట్లు తెలిపారు. వైసిపి పట్టణ అధ్యక్షులు బి.దేవా, మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి, సన్నీ, కౌన్సిలర్‌ సందీప్‌, సురేష్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు, నాయకులు స్టోర్‌ నాగరాజ్‌, గోవిందు, లాల్‌ బాషా, చంద్ర, వీరాజి, అంజి, చలపతి, చిన్న రామకృష్ణ, హనుమంతు, చిన్న వీరప్ప, మణి, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ కృపాకర్‌, విద్యుత్‌ ఉద్యోగి హనుమంతు నాయక్‌, సచివాలయ అడ్మిన్‌ రాజు ఉన్నారు.