Oct 17,2023 19:53

ఆస్పరిలో మందులు పంపిణీ చేస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - ఆస్పరి
వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని సర్పంచి తిమ్మక్క తెలిపారు. మంగళవారం మండలంలోని కైరుప్పల గ్రామంలో 'జగన్న ఆరోగ్య సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి 'జగనన్న ఆరోగ్య సురక్ష'ను తీసుకొచ్చారని తెలిపారు. స్పెషలిస్టులు గీతావాణి, మంజుల, డాక్టర్‌ రఘురామ్‌ రెడ్డి, శశి కిరణ్‌, దుర్గాబాయి, అంగన్వాడీ సూపర్‌వైజర్‌ పద్మావతి, ఎంపిటిసి లక్ష్మీ, వైసిపి నాయకులు వీరభద్రి, రంగన్న, లక్ష్మన్న పాల్గొన్నారు.