Aug 22,2023 22:19

మహిళలకు బుక్‌లెట్లు అందజేస్తున్న ఎమ్మెల్యే కళావతి

ప్రజాశక్తి - సీతంపేట :  మండలంలోని పెద్దపొల్ల సచివాలయం దుగ్గి పంచాయతీలో గడికారెం, కోసమానుగూడ, రాయలంక, దుగ్గిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలోనే మహిళా సాధికారతకు పెద్ద పీఠ వేయడం జరిగిందని, 99 శాతం పథకాలను మహిళల పేరుతోనే అందిస్తామని తెలిపారు. మహిళలు సంక్షేమ పథకాలను తెలుసుకొని సామాజికంగా, ఆర్థికంగా లబ్ది పొందాలని అన్నారు. గ్రామాల్లో తిరిగి ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబాలను కలుసుకోవడంతో పాటు, వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్‌ లెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ, ఎఎంసి చైర్మన్‌ హిమరక మోహనరావు, జెడ్పీటీసీ ప్రతినిధి సవర రాము, స్థానిక సర్పంచ్‌లు, మండల ఉన్నత అధికారులు, సచివాలయ సిబ్బంది, వైసిపి నాయకులు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.