ప్రజాశక్తి - పెద్దకడబూరు
పెద్దకడబూరు గ్రామ బస్టాండ్‌లో సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం జీపుజాతా నిర్వహించారు. ఈనెల 26 నుంచి 31 వరకు ఆదోని నుంచి కర్నూలు వరకు వందలాది మందితో జరిగే సిపిఎం మహా పాదయాత్రను జయప్రదం చేయాలని జీపుజాతా సాగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వెంకటేశులు, మండల కార్యదర్శి తిక్కన్న, కార్యదర్శి వర్గసభ్యులు కె.పరమేష్, వ్యకాస నాయకులు చిన్నతుంబలం హనుమంతు, ఉప్పర శ్రీనివాసులు, ఉప్పర ఈరన్న, డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి నాగిరెడ్డి, దేవదాసు, చిన్న తుంబలం రాజు మాట్లాడారు. మండలలో 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, పెద్దకడబూరు ఎస్సీ పేటలో ఆది ఆంధ్ర స్కూల్ నుంచి జడ్‌పి హైస్కూల్ వరకు శాశ్వత డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని కోరారు. మండలంలోని విశ్వబ్రాహ్మణులకు రెడ్డీస్‌కు మూడు ఎకరాల శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని తెలిపారు. మండలం నుంచి బైచిగేరి వరకు రోడ్లు వేయాలని, పెద్దకడబూరులో ఉండే దొడ్డిమేకల, హెచ్.మురువణి గ్రామం నుంచి ఎమ్మిగనూరు వరకు తారురోడ్డు వేయాలని కోరారు. ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, కల్లుకుంట గ్రామంలో వాటర్ గ్రేడింగ్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయాలని తెలిపారు. కల్లుకుంట గ్రామానికి ఆదోని డిపో బస్సు ఏర్పాటు చేయాలని, చిన్నతుంబలం గ్రామం సిపిఎం కార్యాలయం నుంచి అర వెంట బసప్ప వరకు రోడ్డు వేయాలని కోరారు. చిన్నతుంబలం గ్రామం పెద్దతోట విద్యుత్ మెయిన్ లైన్ మార్చాలని, విద్యుత్ స్తంభాలు వేయాలని తెలిపారు. బాపురం గ్రామానికి జగనన్న స్థలాలివ్వాలని, పీకలబెట్ట గ్రామం రైల్వే గేటు ఏర్పాటు చేయాలని కోరారు. జగనన్న స్థలాలు ఇవ్వాలని తెలిపారు.
జీపుజాతాను ప్రారంభిస్తున్న వెంకటేశులు










