Jul 20,2023 20:44

కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
మండలంలోని పెద్దహరివాణం గ్రామంలో గురువారం తెల్లవారుజామున డీఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో, రస్తాలలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. ప్రజల రక్షణ, భద్రత కోసం పోలీసులు పని చేస్తున్నారన్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని తెలిపారు. యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారొద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్‌ ధరించాలని తెలిపారు. నలుగురు సిఐలు, నలుగురు ఎస్‌ఐలు, 30 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సిఐలు పార్థసారథి, నిరంజన్‌ రెడ్డి, ఎస్‌ఐలు విజయలక్ష్మి, పీరయ్య, వేణుగోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.