హాజరైన అధికారులు
ప్రజాశక్తి -పెదబయలు: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయంలో జగనన్నకు చెబుతాం అనే కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి యల్ పూర్ణయ్య, తహసిల్దార్ కృష్ణారావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 94 వివిధ శాఖలకు సంబంధించిన విన్నతులను ప్రజా ప్రతినిధులు, ప్రజలు దగ్గర నుండి స్వీకరించారు. ఎక్కువగా ఇంజనీరింగ్ శాఖ కు సంబంధించి సిసి రోడ్లు, బీటీ రోడ్లు, మంచినీటి సదుపాయం పాఠశాల మరమ్మతులు తదితర వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోండా వరహాలమ్మ , జిల్లా ప్రాదేశిక సభ్యులు కె.బొంజు బాబు, మండల ఉపాధ్యక్షులు కొర్ర. రాజబాబు, స్థానిక సర్పంచ్ పి.మాధవ, స్థానిక ఎంపిటిసి కె. బాంజు బాబు పాల్గొన్నారు.










