ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి రైతుల కోసం పరితపించిన మహనీయుడని, ఆయన పదవులకే వన్నెతెచ్చారని టిడిపి నాయకులు కొనియాడారు. బుధవారం స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయంలో కోట్ల విజయభాస్కర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడారు. కోట్ల విజయభాస్కర రెడ్డి రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పదవులకే వన్నెతెచ్చారని తెలిపారు. పల్లెపల్లెకు తాగు, సాగునీరు అందించారని చెప్పారు. మహిళల ఆత్మగౌరవం కోసం వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సారాను నిషేధించిన మహోన్నతుడని కొనియాడారు. టిడిపి నాయకులు బనవాసి ఆదినారాయణ రెడ్డి, కదిరికోట ఆదెన్న, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ జి.అల్తాఫ్, రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, మండలం ఆత్మ మాజీ ఛైర్మన్ కందనాతి శ్రీనివాసులు, టిడిపి నందవరం మండల నాయకులు ముగతి వీరారెడ్డి, బనవాసి శ్రీకాంత్ రెడ్డి, కె.తిమ్మాపురం కురుమన్న, టిడిపి ముస్లిం, మైనార్టీ నాయకులు మేటి వలీబాష, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్స్ హుస్సేని, దర్జీ మోషన్న, ఎస్.సాల్మన్, జాలవాడి ఏసన్న, 6వ వార్డు శంకర్ పాల్గొన్నారు.
ఎమ్మిగనూరులో నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు










