దీక్షా శిబిరంలో పాల్గొని మద్దతు తెలుపుతున్న అప్పలనాయుడు, ఇ.వి.నాయుడు
ప్రజాశక్తి-కొమరాడ : నాగావళి నదిపై పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం కోసం చేపడుతున్న రిలే దీక్షలో శనివారం పదో రోజుకు చేరాయి. దీక్షలకు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, సిపిఐ జిల్లా నాయకులు ఇ.వి.నాయుడు, వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి.సంఘం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వంతెన పెండింగ్ పనులు పూర్తిచేసి గిరిజనుల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు.
మధ్యలో నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. దీక్షలో సాధన కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, బత్తిలి శ్రీనివాసరావు, పాలక నూకరాజు, పకీరు శంకర్రావు, లక్ష్మణరావు, పోలినాయుడు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










