padlu estunna vakers nayakulu
'పది' విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ
ప్రజాశక్తి-పెదపారుపూడి
గుడివాడ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పెద పారుపూడి హైస్కూల్‌లో కొత్తపల్లి మధుబాబు మల్లికా సహకారంతో 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు నారాయణరెడ్డి, ట్రెజరర్ లక్ష్మీనారాయణరెడ్డి జాయింట్ సెక్రటరీ శివ, సిహెచ్.అజరు కుమార్, మెట్రో శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, మాజీ డిప్యూటీ గవర్నర్ వీరశేఖర్, మహిళా వాకర్స్ అధ్యక్షురాలు రమ్యా రెడ్డి, మహిళా వాకర్స్ సభ్యులు, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










