Apr 06,2023 22:44

విద్యార్థితో మాట్లాడుతున్న కలెక్టర్‌

కొత్తచెరువు : పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ చెప్పారు. మండల కేంద్రంలోని బాలురు, బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, శ్రీవిద్య పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను ఆయన పరిశీలించారు. జిల్లాలో 125 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ గోపాల్‌ నాయక్‌, డిపార్ట్‌మెంట్‌ ఛీప్‌ చెన్నకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : పదవ తరగతి పరీక్షలను జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి పరిశీలించారు. పట్టణంలోని బాలయేసు, నేతాజీ, అజీజియా, వెలంగణి మాతా పాఠశాలల్లో జరిగే పరీక్షలను ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు పట్టణంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాతంగా జరుగుతున్నట్లు తెలిపారు.
రొద్దం : మండలంలో మూడు సెంటర్లలో గురువారం నిర్వహించిన పదోతరగతి పరీక్షలు సజావుగా సాగాయి. పరీక్షా కేంద్రాలను తహశీల్దార్‌ అనంతచారి, ఎంపీడీవో రాబర్ట్‌ విల్సన్‌, ఎంఇఒ పరిశీలించారు.