ప్రజాశక్తి - చిప్పగిరి
ఇంటి పరిసరాల్లో, గ్రామంలో పచ్చని చెట్లు ఉండడం వల్ల కలుషితం లేని స్వచ్ఛమైన గాలి లభిస్తుందని ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ తెలిపారు. బుధవారం బంటనహాల్ గ్రామంలో సర్పంచి సుశీలమ్మ అధ్యక్షతన ఉపాధి హామీ చట్టం కింద 'నా దేశం... నా భూమి' కార్యక్రమంలో భాగంగా ఎపిఒ మాధవ శంకర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ముఖ్య అతిథులుగా గుమ్మనూరు నారాయణ హాజరయి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పచ్చని చెట్ల మధ్యన ఒక గంట సేద తీరినా ఆరోగ్యం ఎంతో కుదుటపడుతుందన్నారు. చెట్లను తొలగించకుండా బాధ్యతతో మొక్కలు నాటి పెద్దగా అయ్యేంత వరకు సంరక్షించుకుందామని ప్రజలను కోరారు. ఎంపిడిఒ కొండయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రమీల, వైసిపి నాయకులు రాజన్న, పరమేష్, తిరుమలేష్, సతీష్ పాల్గొన్నారు.
పాఠశాలలో విద్యాబోధనపై ఆరా
బంటనహాల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పర్యటించి విద్యా బోధన ఎలా ఉందని గుమ్మనూరు నారాయణ ఆరా తీశారు. అలాగే తాగునీటి వసతి, మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉంటుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. అనంతరం పీర్ల చావిడి పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందించారు. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
మొక్కల విశిష్టతపై మాట్లాడుతున్న గుమ్మనూరు నారాయణ










