Jul 21,2023 19:04

మొక్కలు పంపిణీ చేస్తున్న సర్పంచి

ప్రజాశక్తి - కోసిగి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కోసిగి మేజర్‌ పంచాయతీ సర్పంచి ఎస్‌.అయ్యమ్మ, ఇన్‌ఛార్జీ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మొక్కలను పెంచి గ్రామాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దాలని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వర్షాకాలం కావడంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులను కోరారు. వైసిపి సీనియర్‌ నాయకులు ఎస్‌.మాణిక్య రాజు, వార్డు మెంబర్‌ ఈరన్న, నాయకులు నాడిగేని నాగరాజు, ఎస్‌.రాజేష్‌ పాల్గొన్నారు.